రామా రఘు రామా కరుణామయ జానకి రామా
రామా శ్రీ రామా శరణాగత రక్షక రామా
పావనమౌను నీ పవనము సోకిన
పవనాత్మజ మది నివాసిత రామా
నీ పదమంటిన నీ పదం అంటినా
శుభమే కలుగును దశరధాత్మజ గుణాభి రామా
నీ దయ చూపిన , నను దయ చూచిన
నిన్నే కొలిచెద సీతా పరిణయ కళ్యాణ రామా
నీ దరి చేరిన , నను దరిచేర్చుము
నిన్నే వేడితి చింతానాయక జయ రామా ||
mi kavitalu anni baavunnayi andi.
ReplyDelete