Monday, October 4, 2010

మైత్రి

ధాత్రి పైని తియ్యని బంధం మైత్రి
కలిమి, లేమి భేదాలెరుగని ప్రేమ బంధం చెలిమి
అది నాకందించిన ఓ మిత్రమా.....!
నీ అడుగడుగునా నేనుంటా , నీ కడగళ్ళలో తోడుంటా
పొంగిపోయిన నాడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తా
కుంగిపోయిన నాడు చేయి పట్టి ఊతమిస్తా
అంతు తెలియని బంధంతో నను బంధించావు
అంతులేని ప్రేమను నాకందించావు
నీ ప్రతి కలకు నే ప్రతి రూపాన్నవుతా
నా చితి వరకు నీ జతలోనే బ్రతికేస్తా

No comments:

Post a Comment