Monday, October 4, 2010

కళ

హలం దున్నితే పంట

కలం దున్నితే పాట

పంట కడుపు నింపితే

పాట మనసు నింపుతుంది

కడుపు నిండిన కన్ను కలలు కంటే

మనసు నిండిన కన్ను కళలు కంటుంది

కల కంటి పొరల్లో కరిగిపోతే

కళ గుండె పొరల్లో నిలిచిపోతుంది

కలను ఆస్వాదించు ,కళను ఆరాధించు

కలను నిజం చేసుకో ,కళను ఆ కలకు బాట చేసుకో ||

No comments:

Post a Comment