అధరదరహాసము పూయింపగా నువ్వు
మధుర మధురసము చిందించే నీ నవ్వు
కలువ వలువల నీడ నీ నయన కన్నియలు
ఒలికింప చూపెను హరివిల్లు వన్నియలు
పన్నెత్తి పలికిన పన్నీటి జలకమ్ము
ఆడెను నీ నోట ప్రతి అక్షరమ్ము
నీ గాలి సోకిన చిరుగాలి ఉప్పొంగే
తన వెంట రమ్మనెనె నీ పయిట కొంగే||
No comments:
Post a Comment