Monday, October 4, 2010

తెలుగు తల్లి ఆవేదన

నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
దారి చూపేటి దివ్వెను
నీ కడుపు నింపేటి బువ్వను
వినరా నా గోడు తెలుగోడా !
నన్ను బ్రతికించు ఓ యువకుడా !
తియ్యని మాట నా కడుపున పుట్టింది
తెలుగు వారందరికీ వారసురాలయింది
ఎంగిలి మాటలు వచ్చి పెత్తనం చేస్తుంటే
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా !
నన్ను బ్రతికించు ఓ యువకుడా !

నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
నీ తోటలోని పువ్వును
పసిపాప మురిపాల నవ్వును

అమ్మ బాబు వేలు వదిలిన బాల్యము
మమ్మీ డాడిల వెంట పరిగెత్తుతున్నది
రోజురోజుకి నేను కనుమరుగైపోతున్నా
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా !
నన్ను బ్రతికించు ఓ యువకుడా !

నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
అందాల పడతి మువ్వను
భాషా గగనాన తారాజువ్వను

No comments:

Post a Comment