కలగానే కలిసాను
కలలోనే వలచాను
కన్నీళ్ళే నిజమని నాకు ఇన్నాళ్ళకు తెలిసేను
దేవతవని తలచాను
నా మతమే మార్చాను
అమృతమే ఇస్తావని దోసిలినే పట్టాను
శాపాలే పొందాను
సతమతమై పోయాను
విషమే యద నింపుకుని కథ కంచికి చేర్చాను
కల్లెంతగా వెతికినా ,నీకోసం బ్రతికినా
ఎంతగ బతిమాలినా,నీ మనసు కరగదా ,నా మనసు ఎరగవా
నేనేమో నీవన్నా,నువ్వేమో కాదన్నా
నీకోసం వేచున్నా,నీ మనసు తెలుపదా,నా మనసున ఈ వ్యధ
కన్నీరే వస్తున్నా,మున్నీరై పోతున్నా
నీ కలలే కంటున్నా ,నీ మనసు మారదా ,నా మనసును చేరదా
No comments:
Post a Comment